KMM: వీధి కుక్కలు వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన మధిరలో జరిగింది. మంగళవారం మధిరలోని ముస్లిం బజార్లో కపిలవాయి శ్రీధర్ శర్మ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అతనిపై కుక్కలు దాడి చేశాయి. శర్మ శరీరంపై తీవ్రంగా గాట్లు పడ్డాయి. స్థానికులు కుక్కలను తరిమికొట్టి అతని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.