SRPT: నడిగూడెం ఏవోగా గోలీ మల్సుర్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్గొండ జిల్లా వేములపల్లి ఏఈవోగా పనిచేసిన ఆయన పదోన్నతిపై ఇక్కడికి బదిలీపై వచ్చారు. మంగళవారం నూతన ఏవో మల్సుర్కు సిబ్బంది అభినందనలు తెలిపారు. అదే విధంగా గత ఏవో దేవప్రసాద్కు శాలువతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఏఈవోలు రేణుక, గాయత్రి, పిచ్చయ్య పాల్గొన్నారు.