టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్‌గా ఉన్న నటుడు మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. భారత సైన్యాధిపతి జనరల్ ద్వివేది చేతుల మీదుగా ఆయన ‘COAS కమెండేషన్’ను అందుకున్నారు. మోహన్‌లాల్ చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ ఇటీవలే దాదా ఫాల్కే పురస్కారం వరించింది. ఈ గౌరవం పట్ల ఆయన SM వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.