WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ SC కాలనీలో గత ఏడాదిగా వీధిదీపాలు లేక కాలనీవాసులు రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం లేకపోవడం, నిధుల కొరతతో అధికారులు స్పందించలేదు. ఈ సమస్యను గమనించిన జిల్లా ప్రవీణ్, వేల్పుగొండ ప్రవీణ్, నక్క వెంకటేశ్, శశి కుమార్ అనే యువకులు మంగళవారం స్వచ్ఛందంగా వీధిదీపాలు అమర్చారు.