ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. గత రెండు వారాలుగా అక్కడి గాలి నాణ్యత మరింత తగ్గింది. ఈ క్రమంలో భారత్కు సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. చైనా ఒకప్పుడు తీవ్రమైన పొగమంచుతో ఇబ్బంది పడినట్లు భారత్లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ వెల్లడించారు. అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నవారితో తమ ప్రయాణాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.