ADB: పిల్లర్‌కు తాడు కట్టి ఆడుతుండగా బాలుడిపై ప్రమాదవశాత్తు పిల్లర్ పడి దుర్మరణం చెందిన విషాద ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంద్ర నగర్‌కు చెందిన దౌరే వీర్ (7) ఇవాళ ఇంటి ఆవరణలో పిల్లర్‌కు తాడు కట్టి ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా పిల్లర్ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.