ఈ రోజు సా.6:49 గం.లకు సూపర్ మూన్ ఏర్పడనుంది. చంద్రుడు కొంచెం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు భూమికి 3,57,000 కి.మీ దూరంలో ఉంటాడు. ఇది ఈ ఏడాదిలో వచ్చే రెండో సూపర్ మూన్ అని నాసా వెల్లడించింది. స్పష్టమైన ఆకాశం ఉంటే, ప్రత్యేక పరికరాలు లేకుండానే దీనిని చూడవచ్చు. కాగా వచ్చే నెలలో మరో సూపర్ మూన్ ఏర్పడనుంది.