TPT: పుత్తూరు పట్టణంలోని RTC బస్టాండ్ సమీపంలో బుధవారం నూతన మద్యం దుకాణం ప్రారంభం కానుంది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. “వైన్ షాపు వద్దు” అనే ఫ్లకార్డులు పట్టుకుని రోడ్డుపై నిరసనగా బైఠాయించారు. అయితే బస్టాండ్ పరిసర ప్రాంతం నిత్యం రద్దీగా ఉండటంతో, ఇక్కడ మద్యం షాపు ఏర్పాటు చేస్తే సమస్యలు తప్పవని వారు వాపోయారు.