GDWL: కార్తీక మాసం సందర్భంగా గద్వాల జిల్లా భక్తుల సౌకర్యార్థం వైష్ణవ ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని డీఎం సునీత బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వేములవాడ దర్శిని పేరుతో వేములవాడ, కోటిలింగాలు, ధర్మపురి, కొండగట్టు, కొమరవెల్లి క్షేత్రాలు 2 రోజుల్లో దర్శించుకునేందుకు ఈనెల 8న తెల్లవారుజామున 4:00 సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు.