MNCL: కోటపల్లి మండలం జనగామలో జరిగే మదున పోచమ్మ జాతరకు మంత్రి వివేక్ సూచన మేరకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పారుపల్లి నుంచి లింగన్నపేట వరకు రోడ్డు గుంతల మయంగా మారిందని మంత్రి వివేక్‌కు మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, గ్రామస్తులు తెలియజేశారు. 5 రోజుల జాతరను దృష్టిలో పెట్టుకొని అడిగిన వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయించిన మంత్రికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.