ASR: జిల్లాలో 14 ఉన్నత పాఠశాలల నుంచి 42 మంది విద్యార్థులు చెకుముకి సైన్స్ పోటీలకు ఎంపికయ్యారు. దీనిని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బొజ్జయ్య బుధవారం వెల్లడించారు. రంపచోడవరంలో విజేతలకు బుధవారం సర్టిఫికెట్స్ అందజేశారు. ఈనెల 23న జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో వీరంతా పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఆదరణ పెరిగిందని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు.