W.G: బీసీలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, కులగణనను పారదర్శకంగా పూర్తి చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దాడ గణేశ్ భవాని డిమాండ్ చేశారు. బుధవారం పాలకొల్లులో అధ్యక్షుడు పొన్నమండ ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముద్దాడ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.