RR: తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాలాల మండలం హాజీపూర్కి చెందిన భార్యా భర్తలు లక్ష్మీ, బందప్పల పిల్లలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి, చదివించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రూ. 5 లక్షలు, ఆర్టీసీ రూ. 2 లక్షలు కలిపి రూ.7 లక్షల పరిహారం చెక్కులను ఆయన బాధిత కుటుంబాలకు అందజేశారు.