శ్రీ విష్ణు హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. ఆసక్తికరమైన కథతో, కొత్త తరానికి నచ్చే వినోదాత్మక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నాడు. ఈ చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని నిర్మాత వెల్లడించాడు. కాగా, ఈ బ్యానర్లో ఇది 39వ చిత్రం కానుంది.