KDP: కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల ఏర్పాట్లను దర్గా నిర్వాహకులు, పోలీసు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అయితే సుమారు 400 మంది పోలీసు సిబ్బందితో, ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.