ప్రకాశం: పామూరు పట్టణంలో బుధవారం దర్శి ఆర్టీవో అధికారి రవికుమార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ట్రావెల్స్ బస్సులో అత్యవసర ద్వారం వద్ద ఉన్న బెర్త్ తొలగించి 23వేల రూపాయలు జరిమానా విధించారు. పత్రాలు సరిగా లేని పలు వాహనాలకు 55 వేల రూపాయలు జరిమానా విధించారు. అనంతరం వాహనదారులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు.