MBNR: రంగారెడ్డి గూడ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అన్నారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ లబ్ధిదారులతో భోజనం చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.