కూరెళ్ల విఠలాచార్య.. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన రచయిత, కవి. 5 దశాబ్దాలుగా రచనలు సాగిస్తూ 22కు పైగా పుస్తకాలు రచించారు. సాహిత్యం పట్ల ఆయనకున్న ప్రేమతో యాదాద్రి జిల్లా యెల్లంకిలో తన సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి 2లక్షల పుస్తకాలను పొందుపర్చారు. సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గానూ 2024లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 2019లో దాశరథి అవార్డు వరించింది.