కోనసీమ: రాజోలు మండలం కడలి గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి దేవి అమ్మవారిని కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఆలయ నిర్వహకులు వెండి చీరతో అలంకరించారు. ఈ సందర్భంగా రజత కవచాలంకృత అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.