NZB: జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు పీఏగా కొనసాగుతున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారికి హ్యూమన్ రైట్స్ కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పీఏగా విధులు నిర్వహించడం పట్ల మోపాల్ మండలం సిరిపూర్‌కు చెందిన బొడ్డు గోపాల్ ఇప్పటికే అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.