NLR: కోవూరులోని గుమ్మల దిబ్బలో చాలా మంది తుఫాన్ కారణంగా ఇబ్బంది పడ్డారు. చేనేత కుటుంబాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నిత్యావసరాలు ఇవాళ అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రతి ఒక్క హామీతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అధికారులు, నాయకుల సమన్వయంతో తుఫానును ఎదుర్కోగలిగామన్నారు.