KKD: పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన కేతవరపు కృష్ణను ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. సుదీర్ఘకాల రాజకీయ అనుభవం, వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘాల్లో ఉన్నత పదవులు నిర్వహించిన కృష్ణ, ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా కృష్ణను పలువురు అభినందించారు.