NGKL: జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని బుధవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. 12 ఏళ్లు నిండినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రమాదాల వల్ల వికలాంగులైనవారు సర్జరీ తర్వాత మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాతే ఈ క్యాంపునకు అర్హులవుతారని ఆయన వివరించారు.