WNP: కాంగ్రెస్ అరాచక పాలనతో రాష్ట్రం అధోగతి పాలయిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. BRS పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం రహ్మత్ నగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి మాట్లాడుతూ.. 6 గ్యారంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని ఘాటుగా విమర్శించారు. ఆడ బిడ్డను అవమానంగా మాట్లాడిన మంత్రులు క్షమాపణ చెప్పాలన్నారు.