NZB: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు చక్రపాణి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రతినెల 5వ తేదీలోపు వంట బిల్లులు, వేతనాలు చెల్లించాలని కోరారు. స్వీపర్లు, స్కావెంజర్లకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.