MHBD: పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకుడు బందు సాయిలు అన్నారు. బుధవారం తొర్రూరులోని గోపాలగిరి రోడ్డులో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వానికి కనిపించడం లేదా అని విమర్శించారు.