KNR: ఇటీవల కురిసిన వర్షాలకు శంకరపట్నం మండలంలో 2,100 ఎకరాలలో పంట దెబ్బతినిందని మండల వ్యవసాయ అధికారివెంకటేష్ తెలిపారు. 17 గ్రామాలలో1,503 మంది రైతులు పంట నష్టపోయినట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. నష్టపోయిన రైతుల వివరాలను రైతు భరోసా యాప్లో క్షేత్రస్థాయిలో ఏఈవోలతో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసాతో ప్రభుత్వం ఏకరానికి రూ. 10వేల అందిస్తారని అన్నారు.