ASR: కొయ్యూరు మండలం అడ్డాకుల గ్రామంలో నివసిస్తున్న గిరిజనేతరులకు భూమి పట్టాలు ఇవ్వవద్దని ఆదివాసీ జేఏసీ జిల్లా కో-కన్వీనర్ లోవరాజు డిమాండ్ చేశారు. బుధవారం జేఏసీ మండల కమిటీ సభ్యులు పద్మ శ్రీను, పాపారావు, చిన్నాతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామికి వినతి అందజేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు పట్టాలు ఇస్తే, గిరిజన చట్టాలను ఉల్లంఘించడం అవుతుందన్నారు.