KMR: తాడ్వాయి మండలంలోని శబరి మాత ఆలయంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆయన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శబరిమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని చెప్పారు.