NZB: జిల్లా కేంద్రంలోని శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దర్శనానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్కు పూజారులు అర్చన, హారతి చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో రాములు, ఛైర్మన్ బింగి మధు స్వామి వారి శేష వస్త్రంతో సన్మానించారు.