AP: పరకామణి ఆస్తుల వివరాలు ఉంటే తెలపాలని సీఐడీ డీజీ రవిశంకర్ కోరారు. పరకామణి కేసు విచారణ వివరాలను ఆయన వెల్లడించారు. పరకామణి ఆస్తుల వివరాలు 9440700921 నంబర్‌కు, మెయిల్ ఐడీ adgcid@ap.gov.inకు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. పరకామణి చోరీ కేసుపై డిసెంబర్ 2లోగా హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామని సీఐడీ డీజీ చెప్పారు.