NRML: దిలావర్పూర్ మండలం టెంబర్నీలోని చారిత్రక షా లుత్ఫుల్లా దర్గ వద్ద 17వ శతాబ్దపు ఉర్దూ,ఫార్సీ భాషల్లో రెండు దైవ శాసనాలు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావ్ బుధవారం తెలిపారు. శాసనాలు అల్లాహ్ దయ,రక్షణకు సంబంధించిన ఖురాన్ వచనాలను చెక్కినవని ఆయన తెలిపారు. ఈ దర్గా 1916–17లో పురావస్తు శాఖ రికార్డుల్లో నమోదైనట్లు వారు పేర్కొన్నారు.