VZM: APSSDC ఆధ్వర్యంలో ఈనెల 7న ఉదయం 9 గంటలకు విజయనగరం AGL డిగ్రీ కాలేజీ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత కుమార్ బుధవారం తెలిపారు. ఇందులో 18-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు పాల్గొనవచ్చన్నారు. SSC, ఇంటర్మీడియట్, ITI, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించాలన్నారు.