JGL: ధర్మపురి క్షేత్రంలో బుధవారం వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. భక్తులు గోదావరి నదిలో స్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ అలయాల్లో దర్శనం చేసుకున్నారు. ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించి కార్తీక దామోదరుడికి భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు నిర్వహించారు.