PPM: ఆకతాయిల నుంచి రక్షణ పొందడం, పోక్సో కేసు తదితర అంశాలపై విద్యార్థినీలకు పాలకొండ శక్తి టీం సభ్యులు అవగాహన కల్పించారు. వీరఘట్టం మండలం తంపటాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీం సభ్యులు ప్రకృతాంబ, గణపతి తదితరులు బాలికలు ఆకతాయిల నుంచి ఎలా రక్షణ పొందాలో ప్రయోగాత్మకంగా వివరించారు.