కోనసీమ: రామచంద్రపురంలోని భాష్యం స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న సిర్రా రంజిత (11) ఉరివేసుకుని ఆత్మహత్య ఘటన పై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మ హత్యకు పాల్పడిన గృహానికి పోలీసులు చేరుకుని గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత హత్య, ఆత్మహత్య తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.