KMM: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపును కాంక్షిస్తూ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇవాళ ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు జూబ్లీహిల్స్ ప్రజలు స్వాగతిస్తారని నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.