WGL: నర్సంపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో AISF ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా AISF నాయకుడు పవన్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించే ఏకైక విద్యార్థి సంఘం AISF అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి సభ్యత్వం స్వీకరించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.