BDK: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇప్పుడు ఉచిత ప్రమాద బీమా పథకాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయని సీఎండీ ఎన్.బలరాం అన్నారు. సింగరేణిలో ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రారంభించిన ఉచిత ప్రమాద బీమా పథకం దేశంలోనే తొలిసారిగా అమలు చేసి, ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచిందని ఇవాళ తెలిపారు.