టీమిండియా క్రికెటర్లు అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ సెప్టెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేస్‌లో నిలిచారు. ఆసియా కప్‌లో వారి ప్రదర్శన ఆధారంగా, ఐసీసీ తాజాగా ప్రకటించిన నామినేషన్లలో వీరు చోటు దక్కించుకున్నారు. అలాగే, మహిళల విభాగంలో స్మృతి మంధాన కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది.