E.G: కొవ్వూరు మండలం చిడిపిలో మంగళవారం సాయంత్రం బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇంచార్జ్ తలారి వెంకట్రావు పాల్గొని కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు.