MBNR: నవంబర్ చివరి నాటికి ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పునరావాసం కింద నిర్వాసితులకు 300 గజాల ప్లాటు, ఆ ప్రాంతంలో ఆసుపత్రి పాఠశాల సీసీ రోడ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.