KMM: సీసీఐ నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం బృందం ఏన్కూరు వ్యవసాయం మార్కెట్లో పత్తి కొనుగోలును పరిశీలించారు. ఈ సీజన్లో పత్తి కొనుగోలు నిబంధనలో తెచ్చిన మార్పుల వల్ల జిన్నింగ్ మిల్లులో సీసీఐ సెంటర్లకు అవకాశం లేకుండా పోయిందన్నారు.