KDP: రబీ సీజన్ కోసం పులివెందుల నియోజకవర్గానికి 7,900 క్వింటాళ్ల శనగ విత్తనాలు మంజూరయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో పులివెందుల, వేములకు, వేంపల్లె, లింగాల, తొండూరు, సింహాద్రిపురాలకు విత్తనాలు కేటాయించనున్నట్లు వెల్లడించారు. త్వరలో వీటిని రైతులకు పంపిణీ చేస్తామని, సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు.