NLR: దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 3500 కోట్ల స్కామ్‌తో ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకున్నదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ట్విట్టర్ ద్వారా ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించడం జగన్ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడటం నూటికి నూరుశాతం ఒక్కటేనని ఆయన అన్నారు.