KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.