KNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు,ఎన్నికల ప్రక్రియనిర్వహణపై ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు