BPT: జలజీవన్ మిషన్ అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొత్త నందాయపాలెం గ్రామంలో ఇంకా 120 ఇళ్లకు మంచినీటి కుళాయిలు బిగించలేకపోయారని ఎంపీటీసీ సాంబశివరావు దుయ్యబట్టారు. మంగళవారం గ్రామ సభలో ఆయన అధికారులను నిలదీశారు. రూ. 26.50 లక్షలు మంజూరైనా పని ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. అంచనాలు సరిపోలేదన్న RWS ఏఈ వసుధ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.