ప్రకాశం: సిద్దవటం మండలం ముమ్మడి గుంటపల్లి ఎస్సీ కాలనిలోని తాగునీటి బోరు వద్ద అపరిశుభ్రత నెలకొంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వంటి పదార్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా వ్యాప్తి చెంది విష జ్వరాలు సోకే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే అపరిశుభ్ర ప్రాంతాలను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.