VZM: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది జనం జేజేలు పలుకుతుండగా అమ్మవారు సిరిమాను రూపంలో మూడుసార్లు కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఆశేష భక్త జనావళిని ఆశీర్వదించారు. సుమారు 5.45 గంటలకు ఉత్సవం ముగిసింది.